Komatireddy Raj Gopal Reddy: కోమటిరెడ్డిపై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్

  • కేసీఆర్ గురించి మాట్లాడే దమ్ము నీకుందా? అన్న జగదీశ్ రెడ్డి  
  • వైయస్ పేరు చెప్పుకుని వందల కోట్లు సంపాదించారని ఆరోపణ
  • డబ్బు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించబోమని హెచ్చరిక
Jagadish Reddy fires on Komatireddy Raj Gopal Reddy

కేసీఆర్ ను గద్దె దింపే శక్తి కేవలం బీజేపీకి మాత్రమే ఉందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో సెగను రాజేశాయి. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డిపై మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. గట్టుప్పల్ మండలం ఏర్పాటు కోసం ఎన్నో ఏళ్లుగా జనాలు ఎదురు చూస్తున్నారని... కేసీఆర్ వల్ల ప్రజల కల నెరవేరిందని, మండల ఏర్పాటు జరిగిందని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి చర్యల వల్లే గతంలో గట్టుప్పల్ మండల ఏర్పాటు ఆగిపోయిందని విమర్శించారు. 

కేసీఆర్ గురించి మాట్లాడే దమ్ము కానీ, ఆయనను ఓడించే సత్తా కానీ నీకు ఉందా? అని రాజగోపాల్ రెడ్డిని ప్రశ్నించారు. తెలంగాణను వ్యతిరేకించిన వైయస్ రాజశేఖరరెడ్డి పేరు చెప్పుకుని వందల కోట్లు సంపాదించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని అమ్ముకుని, కాంగ్రెస్ కు ద్రోహం చేస్తూ కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నావా? అని మండిపడ్డారు. డబ్బు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే సహించే ప్రసక్తే లేదని అన్నారు.

More Telugu News