Ranveer Singh: రణవీర్ నగ్న ఫొటోకు నిరసనగా.. వస్త్రాలు దానమివ్వండి అంటూ ఎన్జీవో విరాళాల సేకరణ.. వీడియో ఇదిగో!

  • దేశంలో మానసిక వికారాన్ని తొలగించేందుకు తోడ్పడదామంటూ విరాళాల సేకరణ
  • మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ స్వచ్చంద సంస్థ నిరసన కార్యక్రమం
  • స్థానికుల నుంచి సేకరించిన వస్త్రాలను రణవీర్ సింగ్ కు పంపిస్తామన్న సంస్థ నిర్వాహకులు
After ranveer singh nude shoot NGO starts clothes donation drive for him

బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ చేసిన న్యూడ్ ఫొటో షూట్ ఓవైపు సంచలనం సృష్టిస్తుంటే.. మరోవైపు మరింత వివాదాస్పదంగానూ మారుతోంది. రణవీర్ తీరును తప్పుపడుతూ పోలీస్ స్టేషన్లలో కేసులు, నిరసన ప్రదర్శనలు జరుగుతుంటే.. మధ్యప్రదేశ్ లో ఓ స్వచ్ఛంద సంస్థ వినూత్నంగా నిరసన తెలిపింది.

ఇండోర్ లో వస్త్రాల సేకరణ..
పేదల కోసం విరాళాలు సేకరించి అందజేయడం, సామాజిక కార్యక్రమాలు నిర్వహించే ‘నేకి కీ దివార్’ సంస్థ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో రణవీర్ సింగ్ తీరును నిరసిస్తూ వస్త్రాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. ‘రణవీర్ నగ్నంగా ఉన్నారు. ఆయన కోసం వస్త్రాలు ఇద్దాం. స్వచ్ఛ ఇండోర్ కోసమే కాదు.. దేశంలో మానసిక వికారాన్ని కూడా తొలగించేందుకు తోడ్పడుతాం..’ అంటూ పిలుపునిచ్చింది. ఇండోర్ లోని ఓ ప్రాంతంలో పెద్ద బాక్సును ఏర్పాటు చేసి.. దానిపై రణవీర్ సింగ్ నగ్నంగా తీయించుకున్న చిత్రాన్ని ఏర్పాటు చేసింది.

  • స్థానికుల నుంచి వస్త్రాలు సేకరించి.. రణవీర్ సింగ్ కు పంపిస్తామని స్వచ్చంద సంస్థ నిర్వాహకులు తెలిపారు. రణవీర్ సింగ్ తన నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం ద్వారా మహిళల సెంటిమెంట్లను దెబ్బతీశారని మండిపడ్డారు.

More Telugu News