Spider monkeys: కోతులను కవ్విస్తే ఏమవుతుందో.. ఈ వీడియో చూస్తే తెలుస్తుంది!

Spider monkeys pull girl by her hair in scary viral video from Mexico
  • కొండముచ్చులకు కోపం తెప్పించిన బాలిక
  • ఎన్ క్లోజర్ పై పలు సార్లు కొట్టడంతో వాటికి ఆగ్రహం
  • జాలి నుంచి బాలిక జుట్టుని పట్టుకుని లాగిన వానరాలు
కవ్విస్తే ఎవరికైనా కోపం వస్తుంది. గట్టిగా గద్దిస్తే చిన్నారులకు కూడా కోపం ముంచుకొస్తుంది. అలాంటప్పుడు కోతులు మాత్రం ఆగుతాయా..? అసలే వాటికి కోపం ఎక్కువ. స్పెయిన్ లో ఒక బాలిక గ్రిల్స్ లోపల ఉన్న కొండ ముచ్చులను కవ్వించింది. ఆ తర్వాత అవి చేసిన పనికి ఆ బాలిక విలవిలలాడిపోయింది. ఇన్ స్టా గ్రామ్ లో చేరిన ఈ వీడియో ఇప్పుడు ఎక్కువగా వైరల్ అవుతోంది. 

కొండముచ్చులను ఉంచిన ఎన్ క్లోజర్ దగ్గరకు కొందరు యువకులు, బాలిక వెళ్లారు. బాలిక వాటిని చూడడానికి పరిమితం కాకుండా, ఎన్ క్లోజర్ జాలీని పలుసార్లు చేతులతో కొట్టింది. దీంతో ఒకదానికి కోపం పొడుచుకొచ్చేసింది. వేగంగా వచ్చి జాలీలో చేయి పెట్టి బాలిక జుట్టును పట్టేసుకుంది. రెండు చేతులతో పట్టుకుని గట్టిగా లాగేసింది. పక్కనే ఉన్న మరో కొండముచ్చు కూడా వచ్చి జుట్టును పట్టేసుకుంది. బాలిక నొప్పితో విలవిలలాడుతూ కేకలు వేసింది.

దీంతో అక్కడే ఉన్న ఒక యువకుడు షర్ట్ విప్పేసి చేత్తో పట్టుకుని కోతిపై కొట్టడంతో అది విడిచి పెట్టింది. కొన్ని సెకన్లలో బాలిక మళ్లీ వెనక్కి వెళ్లిపోతుండగా మరోసారి జుట్టును పట్టేసుకుంది. దీంతో అక్కడి యువకుడు మరోసారి విడిపించాల్సి వచ్చింది. (వీడియో కోసం)
Spider monkeys
pull girl
Mexico
vedio
viral

More Telugu News