Realme Pad X: రియల్ మీ నుంచి ఆకర్షణీయమైన ట్యాబ్.. స్మార్ట్ వాచ్

Realme Pad X Watch 3 and 5 more smart products launched in India
  • రియల్ మీ ప్యాడ్ఎక్స్ లో మూడు వేరియంట్లు
  • ఆరంభ ఆఫర్ కింద ఒక్కో దానిపై రూ.2,000 తగ్గింపు
  • స్మార్ట్ వాచ్ ధర రూ.3,499
రియల్ మీ భారత మార్కెట్లోకి పలు నూతన ఉత్పత్తులను విడుదల చేసింది. రియల్ మీ ప్యాడ్ ఎక్స్ మూడురకాల స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ ధర రూ.19,999. ఇది వైఫై సపోర్ట్ తో పనిచేస్తుంది. ఇదే స్టోరేజీ సామర్థ్యంతో 5జీ సపోర్ట్ చేసే ప్యాడ్ ఎక్స్ ధర రూ.25,999. ఇక 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో కూడిన 5జీ ప్యాడ్ ఎక్స్ మోడల్ ధర రూ.27,999. ఆగస్ట్ 1 నుంచి విక్రయాలు మొదలవుతాయి. ఈ మూడు ట్యాబ్ లపై రూ.2,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

 రియల్ మీ వాచ్ 3 ధర రూ.3,499. ఆరంభంలో కొనుగోలు చేస్తే రూ.2,999కే పొందొచ్చు. బడ్స్ ఎయిర్ 3 నియో ధర 1,999. బడ్స్ వైర్ లెస్ 2ఎస్ ధర రూ.1,499. రియల్ మీ ఫ్లాట్ మానిటర్ ను కూడా విడుదల చేసింది. 23.8 అంగుళాలతో ఫుల్ హెచ్ డీ ప్యానెల్, 75 గిగాహెర్జ్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది.
Realme Pad X
Realme WATCH 3
airpads

More Telugu News