Gautam Adani: ముందు ముందు మరిన్ని పెట్టుబడులు పెడతాం: గౌతమ్ అదానీ

  • గ్రూపు మార్కెట్ విలువ 200 బిలియన్ డాలర్లు దాటిందన్న అదానీ గ్రూపు అధినేత
  • దేశ వృద్ధితో తమ వ్యాపారం అనుసంధానమైనట్టు వెల్లడి
  • మరిన్ని కొత్త వ్యాపారాలను అభివృద్ధి చేస్తామని ప్రకటన
Adani Group to invest 70 billion dollars to aid Indias green transition announces Gautam Adani

ఎన్నో దేశాలు ఇప్పుడు తమను సంప్రదిస్తున్నట్టు అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ తెలిపారు. వారి దేశాల్లో మౌలిక సదుపాయాల వృద్ధికి కలసి పనిచేయాలని కోరుతున్నట్టు ప్రకటించారు. గ్రూపు ఫ్లాగ్ షిప్ కంపెనీ అదానీ ఎంటర్ ప్రైజెస్ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 

అదానీ గ్రూపు భారీ మౌలిక సదుపాయాల కల్పన సంస్థగా దేశంతోపాటే వృద్ధి చెందుతున్నట్టు చెప్పారు. గ్రీన్ ఎనర్జీపై 70 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనున్నట్టు తెలిపారు. చమురును దిగుమతి చేసుకునే దేశం నుంచి.. గ్రీన్ హైడ్రోజన్ ను ఎగుమతి చేసే స్థాయికి భవిష్యత్తులో భారత్ చేరుకుంటుందన్నారు. గతేడాది తాము దేశంలోనే అతిపెద్ద ఎయిర్ పోర్ట్ ఆపరేటర్ గా అవతరించినట్టు చెప్పారు. హోల్సిమ్ కు చెందిన అంబుజా సిమెంట్స్, ఏసీసీలను కొనుగోలు చేయడం ద్వారా దేశంలో రెండో అతిపెద్ద సిమెంట్ కంపెనీగా అదానీ గ్రూపు అవతరించినట్టు చెప్పారు.

దేశ వృద్ధికి తమ వ్యాపార మోడల్ అనుసంధానమై ఉందన్నారు. గ్రూపు మొత్తం మార్కెట్ విలువ 200 బిలియన్ డాలర్లను దాటేసిందని, బిలియన్ల డాలర్ల నిధులను అంతర్జాతీయ మార్కెట్ నుంచి సమీకరించినట్టు గౌతమ్ అదానీ తెలిపారు. అదానీ ఎంటర్ ప్రైజెస్ నుంచి వచ్చే దశాబ్ద కాలంలో మరిన్ని కొత్త వ్యాపారాలను అభివృద్ది చేయనున్నట్టు ప్రకటించారు.

More Telugu News