World Bank: ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్తగా భారతీయుడు ఇందర్మీత్ గిల్.. సెప్టెంబరు 1న బాధ్యతల స్వీకరణ

  • ప్రస్తుతం ప్రపంచ బ్యాంకులోనే పలు విభాగాలకు వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఇందర్మీత్
  • కౌశిక్ బసు తర్వాత రెండో భారతీయుడిగా ఘనత
  • షికాగో యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్‌లో డాక్టరేట్ 
World Bank appoints Indian national Indermit Gill as chief economist

ప్రపంచబ్యాంకు ప్రధాన ఆర్థికవేత్తగా, వర్ధమాన ఆర్థిక వ్యవస్థల సీనియర్ ఉపాధ్యక్షుడిగా భారత్‌కు చెందిన ఇందర్మీత్ గిల్ ఎంపికయ్యారు. సెప్టెంబరు 1న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో ఈ పదవి చేపట్టనున్న రెండో భారతీయుడిగా ఇందర్మీత్ రికార్డులకెక్కనున్నారు. అంతకుముందు 2012-16 మధ్య కౌశిక్ బసు ఈ బాధ్యతలు నిర్వర్తించారు. 

కాగా, ఇందర్మీత్ ప్రస్తుతం ప్రపంచబ్యాంకులోనే ఈక్విటబుల్ గ్రోత్, ఫైనాన్స్, ఇనిస్టిట్యూషన్ విభాగాల వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ, సెయింట్ స్టీఫెన్ కాలేజ్ నుంచి బీఏ ఆనర్స్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఎంఏ పూర్తి చేశారు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్ షికాగో నుంచి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ పట్టా అందుకున్నారు.

More Telugu News