తెలంగాణ తెచ్చుకుంది ‘మెగా’ కోసమా?: వైఎస్ షర్మిల
- కేసీఆర్, మెగా ఇద్దరూ తోడు దొంగలేనన్న షర్మిల
- కాళేశ్వరం మునిగితే కృష్ణారెడ్డిపై చర్యలేవంటూ ప్రశ్న
- 80 శాతం ప్రాజెక్టులను మెగాకే ఎందుకిస్తున్నారన్న షర్మిల
రెండేండ్లకే కాళేశ్వరం మునిగితే మెగా కృష్ణారెడ్డిపై చర్యలేవి? అని ప్రశ్నించిన షర్మిల.. 80 శాతం ప్రాజెక్టులు ‘మెగా’కే ఎందుకు ఇస్తున్నరు? అని నిలదీశారు. ఉద్యమంలో ఆంధ్రా కాంట్రాక్టర్లు వద్దని, ఇప్పుడెందుకు ఆంధ్రా కాంట్రాక్టర్ అయిన కృష్ణారెడ్డికి తెలంగాణ సొమ్మును కట్టబెడుతున్నరని ప్రశ్నించారు.