Dulquer Salmaan: 'సీతా రామం' నుంచి ట్రైలర్ రిలీజ్

Sita Ramam Trailer Released
  • విభిన్నమైన ప్రేమకథగా 'సీతారామం'
  • దుల్కర్ జోడిగా మృణాళ్ ఠాకూర్ 
  • కీలకమైన పాత్రలో కనిపించనున్న రష్మిక
  • ఆగస్టు 5వ తేదీన సినిమా విడుదల
'సీతా రామం' అనే టైటిల్ మనసును వెంటనే పట్టుకుంటుంది. ఈ కథలో ఇవి నాయకా నాయికల పేర్లు అనే విషయం అర్థమైపోతుంది. 'యుద్ధం రాసిన ప్రేమకథ' అనే ట్యాగ్ లైన్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. స్వప్న సినిమా బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు.

దుల్కర్ సల్మాన్ .. మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమాలో రష్మిక కీలకమైన పాత్రను పోషించింది. ఈ సినిమాను ఆగస్టు 5వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ కథలో కొంతభాగం 1960లలో నడుస్తుందనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది.

లవ్ .. రొమాన్స్ .. ఎమోషన్ .. సస్పెన్స్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. విశాల్ చంద్రశేఖర్ బాణీలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నట్టు అనిపిస్తోంది. ప్రకాశ్ రాజ్ .. మురళీశర్మ .. వెన్నెల కిశోర్ .. సుమంత్ .. తరుణ్ భాస్కర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నారు.
Dulquer Salmaan
Mrunal
Rashmika Mandanna
Sita Ramam Movie

More Telugu News