రాజ్యసభ సభ్యుడిగా ఇళయరాజా ప్రమాణం.. వీడియో ఇదిగో
- రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఎంపికైన ఇళయరాజా
- ఇళయరాజాతో ప్రమాణం చేయించిన డిప్యూటీ చైర్మన్
- ఇప్పటికే ప్రమాణం చేసిన విజయేంద్ర ప్రసాద్, పీటీ ఉష
ఇళయరాజాతో పాటు తెలుగు సినీ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్, కర్ణాటకకు చెందిన సామాజికవేత్త వీరేంద్ర హెగ్గడే, కేరళకు చెందిన పరుగుల రాణి పీటీ ఉషలను ఇటీవలే కేంద్రం రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్, పీటీ ఉషలు ప్రమాణం చేయగా.. సోమవారం ఇళయరాజా ప్రమాణం చేశారు.