అదంతా 'విరాటపర్వం' మహిమేనట!
- ఇటీవలే థియేటర్లకు వచ్చిన 'విరాట పర్వం'
- ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్
- వేణు ఉడుగుల కథలకు మంచి రెస్పాన్స్
- త్వరలోనే నెక్స్ట్ ప్రాజెక్టు గురించిన ప్రకటన
సినిమా అంటే రెండు ఫైట్లు .. నాలుగు పాటలు అనే కాన్సెప్ట్ కి భిన్నంగా దర్శకుడు వేణు కథలు ఉంటున్నాయి. పాత్రల్లో జీవం .. కథనంలో ఆసక్తి .. సహజత్వానికి పెద్దపీట ఉండటంతో ఆయన కథలు వెంటనే కనెక్ట్ అవుతున్నాయి.
ఈ తరహా కథలు వెబ్ సిరీస్ లలో మంచి ఆదరణ పొందుతున్నాయి. అందువలన ఆయన దగ్గర నుంచి కథలను తీసుకుని .. ఏవి సినిమాలకి పనికొస్తాయి? ఏవి వెబ్ సిరీస్ లు చేసుకోవచ్చు? అనేవి అల్లు అరవింద్ టీమ్ పరిశీలన చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇక తన తరువాత సినిమా ఏమిటనేది వేణు ఉడుగుల త్వరలో ప్రకటించనున్నాడు.