KTR: ఈ పుట్టినరోజు సందర్భంగా బైజూస్ ట్యాబ్ లు అందిస్తున్నాను: కేటీఆర్

KTR says he will distribute Bysus powered tabs to govt college students in Sircilla district
  • 46వ పుట్టినరోజు జరుపుకుంటున్న కేటీఆర్
  • మూడేళ్ల కిందట గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం షురూ
  • వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తిగా ఉందన్న కేటీఆర్
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ లో స్పందించారు. తన వయసులో మరో ఏడాది పెరిగిందని, 46వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రేమాభిమానాలు ప్రదర్శించిన అందరి పట్ల ఎప్పటికీ విధేయుడినై ఉంటానని వివరించారు. అయితే, పుట్టినరోజు జరుపుకోవడంలో ఓ అర్థం ఉండాలన్న ఉద్దేశంతో మూడేళ్ల కిందట 'గిఫ్ట్ ఏ స్మైల్' కార్యాచరణ ప్రారంభించినట్టు కేటీఆర్ వెల్లడించారు. 

"గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా తొలి ఏడాది నేను 6 అంబులెన్స్ లను విరాళంగా ఇస్తే, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ కలిసి 120 అంబులెన్స్ ల వరకు విరాళంగా ఇచ్చారు. రెండో ఏడాది నేను వ్యక్తిగతంగా 200కి పైగా ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలను దివ్యాంగులకు అందించాను. సహచర టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ సంఖ్యను 1,100 వరకు తీసుకెళ్లారు. ఈ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం వ్యక్తిగతంగా నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. 

ఇక, ఈ ఏడాది గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ కాలేజీల్లో చదువుకునే ఇంటర్ విద్యార్థులకు బైజూస్ ట్యాబ్ లను వ్యక్తిగతంగా పంపిణీ చేస్తున్నాను. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఇదెంతో ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాను" అంటూ కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
KTR
Birthday
Gift A Smile
Byju's
Tabs
Rajanna Sircilla District
TRS
Telangana

More Telugu News