Jonnavithula: 1984 నుంచి చిన్నజీయర్ స్వామితో పరిచయం ఉంది: సినీ గీత రచయిత జొన్నవిత్తుల

  • మద్రాస్ వెళ్దామని నిర్ణయించుకున్న తర్వాత జీయర్ స్వామిని కలిశాను
  • ఒక సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశాన్ని రాఘవేంద్రరావు కల్పించారు
  • ఇంత వరకు నాకు ఎలాంటి అవార్డులు రాలేదు
I have contact with Chinna Jeeyar Swamy swamy since 1984 says Jonnavithula

చిన్నజీయర్ స్వామితో తనకు దాదాపు నాలుగు దశాబ్దాలుగా పరిచయం ఉందని ప్రముఖ తెలుగు సినీ గీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు తెలిపారు. 1984 నుంచి ఆయనతో పరిచయం ఉందని చెప్పారు. తాను మద్రాస్ వెళ్దామని నిర్ణయించుకున్న తర్వాత జీయర్ స్వామిని కలిశానని తెలిపారు. వేటూరి, సిరివెన్నెల సీతారామశాస్త్రి గేయ రచయితలుగా ఇండస్ట్రీని ఏలుతున్నప్పుడు తనకు రాఘవేంద్రరావు గొప్ప సహాయం చేశారని.. ఒక సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశాన్ని కల్పించారని చెప్పారు. 

ఎన్నో పాటలు రాసిన తనకు ఇంత వరకు ఎలాంటి అవార్డులు రాలేదని జొన్నవిత్తుల చెప్పారు. పండుగ దినాల్లో ప్రతి ఛానల్ లో తాను రాసిన 'అయ్యప్ప దేవాయ నమః', 'జగదానంద కారకా', 'జయ జయ శుభకర వినాయక', 'మహా కనకదుర్గ.. విజయకనకదుర్గ', 'అందరి బంధువయా' తదితర పాటలు అందరినీ అలరిస్తున్నాయని... తనకు ఇంతకు మించిన అవార్డులేం కావాలని అన్నారు. సినీ నటుడు అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'అలీతో సరదాగా' షోలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News