తెలంగాణలో కొత్తగా 652 మందికి కరోనా

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 33,017 కరోనా పరీక్షలు నిర్వహించగా, 652 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో 297, రంగారెడ్డి జిల్లాలో 57, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 51 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 627 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు.

తెలంగాణలో ఇప్పటిదాకా 8,13,772 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8,04,950 మంది ఆరోగ్యవంతులు కాగా, ఇంకా 4,711 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.

Telangana
Corona Virus
Statistics
Daily Report

More Telugu News