Shreyas Iyer: విండీస్ తో వన్డే.. ఫీల్డింగ్ సందర్భంగా నవ్వులు పూయించిన భారత క్రికెటర్లు

 Shreyas Iyer unique dancing celebration towards stands after taking Shamarh Brooks catch
  • బ్రూక్స్ క్యాచ్ పట్టి డ్యాన్స్ చేసిన శ్రేయాస్ అయ్యర్
  • బ్రాండెన్ షాట్ ను బౌండరీకి పోకుండా అడ్డుకున్న శిఖర్ ధావన్
  • పైకి లేవకుండా పుషప్ లు చేసిన కెప్టెన్
వెస్టిండీస్ పై భారత జట్టు మొదటి వన్డేలో చక్కని విజయాన్ని సొంతం చేసుకుంది. మ్యాచ్ లో భాగంగా భారత జట్టు టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసింది. 309 పరుగుల లక్ష్యాన్ని విధించింది. కానీ, విండీస్ జట్టు భారత్ ను దాదాపు ఓడించినంత పనిచేసింది. 305 పరుగుల వద్దే ఆగిపోయింది. ఈ సందర్భంగా భారత క్రికెటర్ల ఫీల్డింగ్ నైపుణ్యాలు మంచి ఫలితాన్నిచ్చాయి.

అంతేకాదు, ఫీల్డింగ్ సందర్భంగా మన క్రికెటర్లు ప్రత్యేక హావభావాలతో వీక్షకుల మోములో నవ్వులు పూయించారు. 24వ ఓవర్లో శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్ చేస్తుండగా బ్రూక్స్ కొట్టిన షాట్ ను శ్రేయాస్ అయ్యర్ పట్టేశాడు. ఆ తర్వాత అతడు నృత్యం చేయడం కనిపించింది. అలాగే, 37వ ఓవర్లో యజ్వేంద్ర చాహల్ బంతిని విండీస్ ఆటగాడు బ్రాండన్ కింగ్ షాట్ గా మలచగా, ధావన్ దాన్ని పూర్తిగా వాలిపోయి డ్రైవ్ చేసి పట్టేసుకున్నాడు. లేదంటే అది బౌండరీకి పోయేది. అయితే ధావన్ పైకి లేవకుండా అలాగే రెండు మూడు పుషప్ లు చేశాడు. మైదానంలో ధావన్ అప్పుడప్పుడు ఇలాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ చూపిస్తుంటాడు.
Shreyas Iyer
unique dancing
sikhar dhavan
push upps

More Telugu News