TDP: చంద్ర‌బాబు టూర్‌లో మాజీ మంత్రి ప‌ర్సు కొట్టేసిన దొంగ‌లు

ex minister gollapalli suryarao purse stolen in chandrababu tour
  • వ‌ర‌ద ప్రాంతాల్లో 2 రోజులు ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు
  • చంద్ర‌బాబు వెంట ఉత్సాహంగా పాల్గొన్న గొల్ల‌ప‌ల్లి
  • మాయ‌మైన ప‌ర్సులో రూ.35 వేల న‌గ‌దు, 2 ఏటీఎం కార్డులు
టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు రెండు రోజుల పాటు వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో జ‌రిపిన ప‌ర్య‌ట‌న శుక్ర‌వారం సాయంత్రంతో ముగిసింది. ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప‌రిధిలోని వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో చంద్ర‌బాబు ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లాలో చంద్ర‌బాబు జ‌రిపిన ప‌ర్య‌ట‌న‌లో పాల్గొన్న మాజీ మంత్రి గొల్ల‌ప‌ల్లి సూర్యారావుకు షాక్ త‌లిగింది. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న వెంట సూర్యారావు బిజీగా ఉండ‌గా... సూర్యారావు జేబులో ఉన్న ప‌ర్సును మాత్రం దొంగ‌లు కొట్టేశారు.

గొల్ల‌ప‌ల్లి సూర్యారావు పోగొట్టుకున్న ప‌ర్సులో రూ.35 వేల న‌గ‌దుతో పాటు 2 ఏటీఎం కార్డులు కూడా ఉన్నాయ‌ట‌. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న ముగిశాక తీరా త‌న జేబులో చేయి పెడితే.. అందులో ప‌ర్సు లేని విష‌యాన్ని గుర్తించిన సూర్యారావు షాక్ తిన్నారు. ఆ వెంట‌నే తేరుకుని ఆయ‌న నేరుగా రాజోలు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేప‌ట్టారు.
TDP
Chandrababu
Gollapalli Suryarao
Dr BR Ambedkar Konaseema District
Rajamahendravaram
AP Police
Theft

More Telugu News