ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉంటామన్న టీఎంసీ... మమతపై మండిపడ్డ విపక్ష అభ్యర్థి మార్గరెట్ అల్వా
- ఇది కోపం, అహం చూపే సమయం కాదన్న మార్గరెట్ అల్వా
- టీఎంసీ నిర్ణయం నిరాశపరిచిందని వ్యాఖ్య
- మమత ఇకనైనా విపక్షాలకు అండగా నిలుస్తారని భావిస్తున్నానన్న మార్గరెట్
ఈ నేపథ్యంలో మమతా బెనర్జీపై విపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వా మండిపడ్డారు. ఇది కోపం, అహం చూపే సమయం కాదని ఆమె అన్నారు. ఓటింగ్ కు దూరంగా ఉండాలని టీఎంసీ తీసుకున్న నిర్ణయం నిరాశపరిచిందని చెప్పారు. విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడానికి ఇది సమయం కాదని అన్నారు. ఐక్యత కోసం పోరాడాల్సిన సమయం ఇదని చెప్పారు. మమతా బెనర్జీ ఇకనైనా విపక్షాలకు అండగా నిలుస్తారని భావిస్తున్నానని తెలిపారు.