: రితుపర్ణోఘోష్ మృతి భారతీయ చిత్రపరిశ్రమకు తీరని లోటు: రామానాయుడు
ప్రముఖ బెంగాలీ దర్శకుడు రితుపర్ణోఘోష్ తీవ్ర గుండెపోటుతో ఈ ఉదయం ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మృతిపట్ల మూవీమొఘల్ రామానాయుడు సంతాపం ప్రకటించారు. 49 ఏళ్ల రితుపర్ణోఘోష్ 19 ఏళ్ల సినీ జీవితంలో 12 జాతీయ అవార్డులు అందుకున్నారని, మరి కొన్ని అంతర్జాతీయ అవార్డులు కూడా అందుకున్నారని తెలిపారు. రితుపర్ణోఘోష్ దర్శకత్వంలో 1999లో తను నిర్మించిన 'ఆకుష్' సినిమా 46 వ జాతీయ చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా నిలిచిందని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటని రామానాయుడు వ్యాఖ్యానించారు. పలువురు తెలుగు సినీ ప్రముఖులు రితుపర్ణోఘోష్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు.