: సిరియా సైన్యానికి రష్యన్ ఎన్-300 క్షిపణులు
సిరియాలో తిరుగుబాటుదారులను అణచి వేసేందుకు రష్యా సరఫరా చేసిన విమాన విధ్వంసక ఎన్-300 క్షిపణులు సిరియాకు చేరాయి. గత కొన్ని నెలలుగా సిరియాలో అంతర్యుద్ధం రాజుకుంటోంది. తిరుగుబాటు దారులు, ప్రభుత్వ దళాలకు మధ్య భీకరయుద్ధం జరుగుతోంది. ఈ క్షిపణులు తమ దేశం చేరాయని డమాస్కస్ లో సిరియా అధ్యక్షుడు అస్సాద్ ప్రకటించారు. వీటి చేరికతో తమ దళాల బలం రెట్టింపయిందని, తిరుగుబాటు దారుల్ని దారికి తెచ్చుకోవడం ఇప్పుడు పెద్ద కష్టం కాదని అస్సాద్ తెలిపారు. ఈ అంతర్యుద్ధంలో ఇప్పటికే రెండు వర్గాల వారు పెద్ద సంఖ్యలో మృతి చెందారు. చాలా చోట్ల ప్రజలు నిరాశ్రయులయ్యారు. మరి కొంతమంది శరణార్ధ శిబిరాల్లో తలదాచుకుంటున్నారని సమాచారం.