తొలి రోజు ముగిసిన సోనియా గాంధీ ఈడీ విచార‌ణ‌

  • తొలి రోజు 3 గంట‌ల పాటు విచార‌ణ‌
  • విచారణ ముగిసే స‌మ‌యంలో సోనియాకు స‌మ‌న్లు
  • ఈడీ కార్యాల‌యంలోనే రాహుల్‌, ప్రియాంక‌
నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) ముందు గురువారం విచార‌ణ‌కు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెను ఐదుగురు అధికారుల‌తో కూడిన ఈడీ బృందం 3 గంట‌ల పాటు విచారించింది. అనంత‌రం తొలిరోజు విచార‌ణ ముగిసిన‌ట్లు ప్రక‌టించిన అధికారులు సోనియాను ఇంటికి పంపించారు.

 ఇదిలా ఉంటే.. ఈడీ కార్యాల‌యంలో సోనియాను విచారిస్తున్నంత‌సేపు ఆయ‌న కుమారుడు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంకా గాంధీ వాద్రా అదే కార్యాల‌యంలోని వేరే గ‌దిలో వేచి చూశారు.


More Telugu News

Enforcement Directorate Congress Sonia Gandhi Rahul Gandhi Priyanka Gandhi Nationa Herald