కొత్త సినిమాలో బాలయ్య మాస్ లుక్ ఫొటోలు లీక్
- ‘అఖండ’తో భారీ విజయం అందుకున్న బాలకృష్ణ
- ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కొత్త సినిమా
- నిన్న ఆలంపూర్ లో కొత్త షెడ్యూల్ మొదలు
బుధవారం ఆలంపూరులో కొత్త షెడ్యూల్ని మొదలు పెట్టారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. తెల్ల ప్యాంటు, చొక్కాలో ఉన్న బాలయ్య ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆయన లుక్ చూస్తుంటే ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్ర చేస్తున్నట్టు అర్థమవుతోంది. ఈ షెడ్యూల్లో మరో మూడు రోజుల పాటు యాగంటి, కర్నూల్, ఓర్వకల్లు, పంచలింగాల ప్రాంతాల్లో షూటింగ్ చేయబోతున్నారు. ఈ ప్రాంతాలన్నీ ఆధ్యాత్మిక ప్రదేశాలు కావడంతో, దేవాలయాలకి సంబంధించిన అంశాన్ని ఈ సినిమాలో కూడా టచ్ చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది.
‘అఖండ’లో అఘోరగా నటించిన బాలయ్య హిందూ దేవాలయాలు, ధర్మాన్ని టచ్ చేసి భారీ విజయం సొంతం చేసుకున్నారు. ఇక సినిమాని డిసెంబర్లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది డిసెంబర్ 2న విడుదలైన ‘అఖండ’ భారీ విజయం సాధించింది. సెంటిమెంట్ ప్రకారం కొత్త చిత్రాన్ని కూడా అదే తేదీన విడుదల చేస్తే బాగుంటుందని యూనిట్ భావిస్తోందని సమాచారం.