Ramcharan: చరణ్ తో తలపడే విలన్ గా ఆయనను ఫైనల్ చేసినట్టే!

shankar and Charan movie update
షార్ట్స్‌లో చూడండి
చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. కెరియర్ పరంగా చరణ్ కి ఇది 15వ సినిమా అయితే, నిర్మాతగా ఇది దిల్ రాజుకి 50వ సినిమా. ఇప్పటికే ఈ సినిమా 8 షెడ్యూల్స్ వరకూ పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్లో చరణ్ కి సంబంధించిన కొన్ని యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించనున్నారు. 

ఈ సినిమాలో విలన్ గా ఎస్.జె. సూర్యను అనుకుంటున్నట్టుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. తాజాగా ఆయననే తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సైకో లక్షణాలు ఉన్న విలన్ రోల్స్ ను ఆయన బాగా చేస్తాడు. అందుకు 'స్పైడర్' సినిమానే ఒక ఉదాహరణ. ఇక 'మానాడు' సినిమాలోని విలనిజం కూడా ఆయనకి మంచి మార్కులను తెచ్చిపెట్టింది.

ఈ నేపథ్యంలోనే చరణ్ సినిమాలో ప్రతినాయకుడి పాత్రకు ఆయనను శంకర్ ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. ముఖ్యమంత్రి తనయుడిగా చరణ్  రోల్ ఉండనుంది. కథానాయిక పాత్రలో కియారా అద్వాని అలరించనుంది. తమన్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.
Go Back to Shorts
Ramcharan
Kiara Adwani

More Telugu News