Tollywood: 'యాభై చిన్న సంఖ్య.. వంద సినిమాలు చేస్తా' అంటున్న హన్సిక

Fifty is a small number my aim to hit a century says Hnsika
  • ఈ నెల 22న విడుదల అవుతున్న ‘మహా’ సినిమా
  • హన్సికకు ఇది 50వ చిత్రం
  • తుదిశ్వాస విడిచే వరకూ నటిస్తూ ఉండాలన్నదే తన కోరిక అన్న నటి

‘దేశముదురు’ చిత్రంతో చిన్న వయసులోనే సినీ కెరీర్ మొదలు పెట్టిన నటి హన్సిక మొత్వానీ... తక్కువ సమయంలోనే తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తెరంగేట్రం చేసి పదిహేనేళ్లు అవుతోంది. ఈ సమయంలో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ మెప్పించింది. హీరోలకి జంటగా కనిపించడమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తోంది. 

ఇక ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘మహా’ ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇది హన్సికకి 50వ సినిమా. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. శింబు కీలక పాత్రలో నటించిన ‘మహా’ ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. యు.ఆర్‌‌.జమీల్‌‌ దర్శకత్వంలో మదియళగన్‌‌ దీనిని నిర్మించారు. శ్రీరామ్, కరుణాకరన్ ఇతర కీలక పాత్రలు పోషించిన చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని అందించాడు. కెరీర్లో 50వ చిత్రం మైలురాయికి చేరుకుంటున్నప్పటికీ హన్సిక దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. 50 చిన్న సంఖ్య అని తాను సెంచరీ కొట్టాలని భావిస్తున్నానని చెప్పింది. 

‘నేను 50 సినిమాలు పూర్తి చేయడం ఎంతో గొప్ప విషయం అని చాలా మంది అంటున్నారు. నేనైతే దీన్ని పెద్ద విషయంగా చూడలేదు. చిన్న వయసులోనే  కెరీర్ ప్రారంభించడం నా అదృష్టం. అదే సమయంలో తమిళ చిత్ర పరిశ్రమ నన్ను అక్కున చేర్చుకుంది. నేను దాదాపు 20 ఏళ్లుగా నటిస్తున్నాను. అయినా ఇప్పుడే కెరీర్ మొదలు పెట్టినట్టు అనిపిస్తోంది. నేను ఇంకా ముందుకు వెళ్లాలి. 50 అనేది చిన్న సంఖ్య.  సెంచరీ కొట్టాలని అనుకుంటున్నా. నా చివరి శ్వాస వరకు నటించాలనుకుంటున్నాను’ అని హన్సిక చెప్పుకొచ్చింది. కాగా, హన్సిక నటించిన ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’, ‘105 మినిట్స్’ చిత్రాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

  • Loading...

More Telugu News