Virat Kohli: శాంపేన్ బాటిల్ అడుగు భాగాన్ని చూస్తున్న కోహ్లీ!... సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన ఫొటో!

a photo of virat kohli with Champagne bottle goes viral on social media
  • ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్ నెగ్గిన టీమిండియా
  • సంబ‌రాల్లో శాంపేన్ బాటిల్ చేత‌బ‌ట్టిన కోహ్లీ
  • ఫొటోను పోస్ట్ చేసిన ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్‌ఫో
టీమిండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీకి చెందిన ఓ ఫొటో మంగ‌ళ‌వారం రాత్రి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎంట్రీ ఇచ్చి వైర‌ల్‌గా మారిపోయింది. 'దీనికి క్యాప్షన్ పెట్టండి..' అంటూ ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్‌ఫో పోస్ట్ చేసిన ఈ ఫొటోలో...కోహ్లీ ఓ శాంపేన్ బాటిల్‌ను చేతిలో ప‌ట్టుకుని దాని అడుగు భాగాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్నాడు. ఆదివారం నాటి వ‌న్డే మ్యాచ్‌లో విక్ట‌రీతో వ‌న్డే సిరీస్‌ను టీమిండియా గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా జ‌ట్టు స‌భ్యుల‌తో క‌లిసి సంబ‌రాల్లో పాలుపంచుకున్న కోహ్లీ... నిర్వాహ‌కులు అందించిన శాంపేన్ బాటిల్‌ను చేతుల్లోకి తీసుకుని దాని అడుగు భాగాన్ని ప‌రిశీలిస్తూ క‌నిపించాడు.

ఈ ఫొటో ట్విట్ట‌ర్‌లో చేరినంత‌నే క్రికెట్ అభిమానులు, నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. ఓ మిడిల్ క్లాస్ యువ‌కుడి మాదిరిగా శాంపేన్ బాటిల్ ధ‌ర‌ను కోహ్లీ చూస్తున్నాడంటూ కొంద‌రు వ్యాఖ్యానించ‌గా...అదేమీ కాదు దాని ఎక్స్ పైరీ డేట్‌ను కోహ్లీ ప‌రిశీలిస్తున్నాడ‌ని మ‌రో నెటిజ‌న్ కామెంట్ చేశాడు. మ‌రో నెటిజ‌న్ అయితే... శాంపేన్ ధ‌ర సామాన్యుల‌కు అందుబాటులోనే ఉందా? లేదా? అనే విష‌యాన్ని కోహ్లీ ప‌రిశీలిస్తున్నాడ‌ని కామెంట్ చేశాడు. మొత్తంగా ర‌క‌ర‌కాల కామెంట్ల‌తో శాంపేన్ బాటిల్‌ను చేత‌బ‌ట్టిన కోహ్లీ ఫొటో తెగ వైర‌ల్‌గా మారిపోయింది.
Virat Kohli
Team India
Cricket
England
Champagne
Twitter

More Telugu News