GVL Narasimha Rao: రాజ్య‌స‌భ‌లో బీజేపీ విప్‌గా జీవీఎల్ న‌ర‌సింహారావు నియామ‌కం

mp gvl narasimha rao appointed as bjp whip in rajyasabha
  • ద‌క్షిణాది రాష్ట్రాల కోటాలో జీవీఎల్‌కు విప్‌
  • 4 రాష్ట్రాల బీజేపీ స‌భ్యుల స‌మ‌న్వ‌యం జీవీఎల్ బాధ్య‌త‌
  • అధికారికంగా ప్ర‌క‌టించిన బీజేపీ
తెలుగు నేల‌కు చెందిన బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావును మ‌రో కీల‌క ప‌ద‌వి వ‌రించింది. రాజ్య‌స‌భ‌లో బీజేపీ విప్‌గా ఆయ‌న‌ నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు బీజేపీ అధిష్ఠానం మంగ‌ళ‌వారం నిర్ణ‌యం తీసుకుంది. ఆయా రాష్ట్రాల‌కు చెందిన పార్టీ స‌భ్యుల‌ను స‌మ‌న్వ‌యం చేసుకునేందుకు పార్టీ నేత‌ల‌కు విప్ ప‌ద‌వుల‌ను కేటాయిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇందులో భాగంగానే ద‌క్షిణాది రాష్ట్రాలకు చెందిన పార్టీ స‌భ్యుల‌ను స‌మ‌న్వ‌యం చేసుకునేందుకు జీవీఎల్ న‌ర‌సింహారావును బీజేపీ విప్‌గా నియ‌మించింది. ఈ హోదాలో జీవీఎల్‌... ఏపీ, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల‌కు చెందిన పార్టీ స‌భ్యుల‌ను స‌మ‌న్వ‌యం చేసే బాధ్య‌త‌ల‌ను చేప‌ట్ట‌నున్నారు.
GVL Narasimha Rao
BJP
Parliament
Rajya Sabha
BJP Whip

More Telugu News