Haryana: మైనింగ్ మాఫియా కిరాతకం.. డీఎస్పీని ట్రక్కుతో తొక్కించి హత్య చేసిన వైనం

Mining mafia killed DSP in Haryana
  • హర్యానాలో చెలరేగిన మైనింగ్ మాఫియా
  • అక్రమ మైనింగ్ ను అడ్డుకునేందుకు వెళ్లిన డీఎస్పీ
  • దారికి అడ్డుగా ఉన్న డీఎస్పీపై నుంచి వాహనాన్ని పోనిచ్చిన వాహన డ్రైవర్
హర్యానాలో మైనింగ్ మాఫియా చెలరేగిపోయింది. తమ కార్యకలాపాలను అడ్డుకునేందుకు వచ్చిన డీఎస్పీని అత్యంత కిరాతకంగా హత్య చేసింది. వివరాల్లోకి వెళ్తే తావడు డీఎస్పీ సురేంద్రసింగ్ బిష్ణోయ్... నూహ్ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందనే పక్కా సమాచారంతో రైడింగ్ కు వెళ్లారు. అక్రమంగా రాళ్లను తరలిస్తున్న వాహనానికి ఆయన అడ్డుగా నిలబడ్డారు. వాహనాన్ని ఆపాలని సైగ చేశారు. అయితే, వాహన డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా నేరుగా ఆయన పైకి ఎక్కించాడు. దీంతో డీఎస్పీ అక్కడికక్కడే మృతి చెందాడు. 

మరోవైపు వెంట్రుకవాసిలో ఇద్దరు పోలీసులు ప్రాణాలతో బయటపడ్డారు. వాహనం దూసుకొస్తున్న సమయంలో వారిద్దరూ దారి పక్కకు జంప్ చేసి ప్రాణాలు కాపాడుకున్నారు. వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై హర్యానా పోలీసు శాఖ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిని చట్టం ముందు నిలబెడతామని ట్వీట్ చేసింది.
Haryana
Mining Mafia
DSP
Murder

More Telugu News