Mani Ratnam: కరోనాతో ఆసుపత్రిలో చేరిన స్టార్ డైరెక్టర్ మణిరత్నం

Mani Ratnam admitted to Chennai hospital after testing Covid positive
  • చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన మణిరత్నం
  • వివరాలు వెల్లడించని వైద్యులు
  • ‘పొన్నియన్ సెల్వన్’ పోస్టు ప్రొడక్షన్ వర్క్‌లో బిజీ
ఇటీవల కరోనా బారినపడిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆయన భార్య, నటి సుహాసిని త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. మణిరత్నం ప్రస్తుతం ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా కోసం పనిచేస్తున్నారు.

ఈ నెల 8న నిర్వహించిన ఈ సినిమా టీజర్ లాంచింగ్‌కు మణిరత్నం ఇటీవల హాజరయ్యారు. ఇదే సినిమా పోస్టుప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్న ఆయనకు ఇటీవల కొవిడ్ సోకింది. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు సంబంధించిన వివరాలను వైద్యులు కూడా వెల్లడించలేదు.
Mani Ratnam
Director
Chennai
Apollo Hospital
COVID19

More Telugu News