Prakash Raj: ప్రకాశ్ రాజ్ దర్శకుడిగా 'మనలో ఒకడు'

Prakashraj Interview
షార్ట్స్‌లో చూడండి
ప్రకాశ్ రాజ్ తన అభిరుచికి తగిన సినిమాలను తెరకెక్కించడం కోసం అప్పుడప్పుడు దర్శకుడిగా మారుతుంటారు. గతంలో ఆయన 'ధోని' .. 'ఉలవచారు బిర్యాని' .. 'మన ఊరి రామాయణం' వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలకు నిర్మాత కూడా ఆయనే. తన సొంత బ్యానర్లోనే వాటిని నిర్మించారు. 

అయితే ఏ సినిమా కూడా ప్రేక్షకులను రంజింపజేయలేకపోయింది. నటుడిగా మంచి మార్కులను సంపాదించుకున్న ప్రకాశ్ రాజ్, దర్శక నిర్మాతగా మాత్రం సక్సెస్ కాలేకపోయారు. దర్శకత్వానికి కొంత గ్యాప్ ఇచ్చిన ఆయన, ఇప్పుడు 'మనలో ఒకడు' సినిమా కోసం మళ్లీ మెగాఫోన్ పడుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.  

ఈ సినిమా కథ కూడా సమాజంలోని సమస్యల్లో నుంచి పుట్టిందే. టైటిల్లో చెప్పినట్టుగా కథానాయకుడు 'మనలో ఒకడు'. కొన్ని పెయింటింగ్స్ చూసిననప్పుడు మనం గీయడమే కరెక్టు అనిపిస్తుంది. అలాగే ఈ కథను నేను డైరెక్ట్ చేయడమే కరెక్ట్ అనిపించింది. అందువల్లనే మళ్లీ మెగాఫోన్ పడుతున్నాను. ఈ సినిమాను నేనే నిర్మిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Prakash Raj
Manalo Okadu Movie
Tollywood

More Telugu News