తప్పుడు వార్తలు రాసే వెబ్ సైట్లపై చర్యలు.. పార్లమెంటు ముందుకు రానున్న కొత్త చట్టం!
- రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రెస్ అండ్ పీరియాడికల్స్ బిల్లుకు తుది మెరుగులు దిద్దుతున్న కేంద్రం
- వర్షాకాల సమావేశాల్లోనే పార్లమెంటు ముందుకు రానున్న బిల్లు
- బిల్లుకు ఆమోదం లభిస్తే మీడియా రిజిస్ట్రేషన్ చట్టం పరిధిలోకి డిజిటల్ న్యూస్
- తప్పుడు వార్తలు రాసే వెబ్ సైట్ల రిజిస్ట్రేషన్ల రద్దు
ఈ కొత్త బిల్లు పార్లమెంటు ఆమోదం పొందితే ఆ వెంటనే చట్టంగా మారనుంది. ఫలితంగా డిజిటల్ మీడియా కూడా చట్టం పరిధిలోకి రానుంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రెస్ అండ్ పీరియాడికల్స్ బిల్లుకు కేంద్రం తుది మెరుగులు దిద్దుతోంది. ఈ బిల్లు ఆమోదం పొందాక తప్పుడు వార్తలు ప్రసారం చేసే డిజిటల్ న్యూస్ సైట్ల రిజిస్ట్రేషన్ రద్దు కావడంతో పాటుగా ఆయా సైట్లపై జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. ఈ బిల్లు చట్టంగా మారితే.. ఇప్పటిదాకా ప్రభుత్వ రెగ్యులేషన్ పరిధిలో లేని డిజిటల్ న్యూస్ ఇకపై మీడియా రిజిస్ట్రేషన్ చట్టం పరిధిలోకి రానుంది.