Kiran Abbavaram: 'వినరో భాగ్యము విష్ణు కథ' గ్లింప్స్ రిలీజ్!

'వినరో భాగ్యము విష్ణుకథ' అనగానే ఇది ఒక చక్కని ఫ్యామిలీ ఎంటర్టయినర్ అనే విషయం అర్థమవుతోంది. బన్నీవాసు నిర్మాతగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది. కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.
 
రేపు కిరణ్ అబ్బవరం పుట్టినరోజు కావడంతో, కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. 'ఏడు  వింతల గురించి మాకు తెలియదు .. మా జీవితాలన్నీ ఏడు కొండల చుట్టూ తిరుగుతూ ఉంటాయి .. మాది తిరుపతి .. నా పేరు విష్ణు .. ఇంకొన్ని రోజుల్లో మీరంతా చూడబోయేదే నా కథ' అంటూ హీరో వాయిస్ పై ఈ గ్లింప్స్ ను వదిలారు. 

ఈ సినిమాతో మురళీ కిశోర్ అబ్బూరు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కశ్మీర అనే కొత్త కథానాయిక ఈ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. సెప్టెంబర్ 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఇటు గీతా ఆర్ట్స్ 2 కి .. అటు కిరణ్ కి ఈ సినిమా హిట్ ఇస్తుందేమో చూడాలి.
Kiran Abbavaram
kashmira
Vinaro Bhagyamu Vishnu Katha Movie

More Telugu News