ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముతో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు
- రాష్ట్రపతి ఎన్నికలపై బీజేపీ శిక్షణ తరగతులు
- తెలంగాణ నుంచి హాజరైన ముగ్గురు ఎమ్మెల్యేలు
- ఫొటోలను పోస్ట్ చేసిన ఈటల రాజేందర్
రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలన్న విషయంపై బీజేపీ దేశవ్యాప్తంగా ఉన్న తన ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఢిల్లీలో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరగతులకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన రాజా సింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్లు పనిలో పనిగా ముర్మును కలిశారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను ఈటల తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.