నిన్న పానీ పూరీ, నేడు పిండి వంటల తయారీ!... బెంగాల్ సీఎం దీదీ వీడియో ఇదిగో!
- డార్జిలింగ్ పర్యటనలో దీదీ
- మోమోలు తయారు చేసిన సీఎం
- బుధవారం పానీ పూరీలు పంచుతూ కనిపించిన వైనం
బుధవారం వీధుల్లో ఉండే పానీ పూరీ బండ్ల వద్ద నిలిచిన దీదీ... జనానికి పానీ పూరీలు అందిస్తూ కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె డార్జిలింగ్ పర్యటనలో భాగంగా పిండి వంటల తయారీలో నిమగ్నమై కనిపించారు. డార్జిలింగ్‌లోని ఓ పిండి వంటకాల తయారీ కేంద్రంలో కూర్చుని అక్కడి సంప్రదాయ పిండి వంటకం మోమోలను తయారు చేశారు. పొయ్యి ముందు పీటపై కూర్చుని మోమోలను తయారు చేస్తున్న దీదీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆకట్టుకుంటోంది.