Mallika Sherawat: 'గెహ్రాయియా' సినిమాలో దీపికా పదుకొణే చేసింది నేను 15 ఏళ్ల కిందటే చేశాను: మల్లికా షెరావత్ వ్యాఖ్యలు

Mallika Sherawat compares with Deepika
  • 'గెహ్రాయియా' సినిమాలో నటించిన దీపికా పదుకొణే 
  • బోల్డ్ గా నటించిన దీపిక
  • తాను మర్డర్ సినిమాలో ఇలాగే నటించానన్న మల్లిక
  • బాలీవుడ్ లో ఓ వర్గం తనను వేధిస్తోందని ఆవేదన

బాలీవుడ్ తార మల్లికా షెరావత్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే 'గెహ్రాయియా' సినిమాలో చేసింది తాను 15 ఏళ్ల కిందటే 'మర్డర్' సినిమాలో చేశానని పేర్కొంది. కిస్సింగ్ సీన్లు, బికినీ గురించి ప్రజలు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారని, కానీ, ఇవన్నీ తాను దీపిక కంటే ముందే చేశానని వివరించింది. అప్పటి ప్రేక్షకులకు ఇంతగా బుద్ధి ఎదగలేదని విమర్శించింది. 

అంతేకాదు, బాలీవుడ్ లోని ఓ వర్గం తనను మానసిక వేదనకు గురిచేస్తోందని ఆరోపించింది. తన శరీరం గురించి, గ్లామర్ గురించి మాట్లాడతారే కానీ, తన నటనా సామర్థ్యాల గురించి మాట్లాడరని వాపోయింది. మొదట్లో హీరోయిన్లు సతీసావిత్రి టైపులో అతి మంచితనంతో ఉండేవారని, ఏమీ తెలియని అమాయకులో, లేక క్యారెక్టర్ లేని వ్యాంప్ లుగానే ఉండేవారని మల్లిక వివరించింది. నాటి హీరోయిన్ల కోసం ఈ రెండు తరహా పాత్రలే రాసేవారని పేర్కొంది.

కానీ ఇప్పుడా పరిస్థితి మారిపోయిందని, స్త్రీలను కూడా మనుషుల్లా చూపిస్తున్నారని వెల్లడించారు. సంతోషమో, దుఃఖమో... తప్పులు చేస్తుందో, తప్పటడుగులు వేస్తుందో... కానీ అందరికీ ప్రేమకు పాత్రురాలవుతోందని ఇప్పటి హీరోయిన్ పాత్రలను మల్లిక విశ్లేషించింది.

  • Loading...

More Telugu News