నీట్ పరీక్ష రాసే అమ్మాయిలకు ఓయో స్పెషల్ ఆఫర్

OYO conveys special offer for NEET aspirants girl students
  • ఈ నెల 17న నీట్
  • 60 శాతం రాయితీ ప్రకటించిన ఓయో
  • తమ హోటళ్లలో బస చేసే విద్యార్థినులకు ఆఫర్
ఈ నెల 17న దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుంది. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం జాతీయస్థాయిలో జరిగే ఈ పరీక్ష కోసం 18 లక్షల మందికి పైగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో, ఆతిథ్య సేవల సంస్థ ఓయో బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయితే ఇది అమ్మాయిలకే వర్తిస్తుంది. నీట్ పరీక్ష రాసే విద్యార్థినులకు తమ హోటళ్లలో 60 శాతం రాయితీ ఇస్తామని ఓయో వెల్లడించింది. ఈ ఆఫర్ జులై 16, 17 తేదీల్లోనే వర్తిస్తుందని వివరించింది. 

అయితే, ఈ రాయితీ పొందాలనుకునేవారు తొలుత తమ ఫోన్లలో ఓయో యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఆ యాప్ ను ఓపెన్ చేసి నియర్ బై ఐకాన్ క్లిక్ చేస్తే... సదరు విద్యార్థిని పరీక్ష రాసే కేంద్రానికి సమీపంలోని ఓయో హోటళ్ల జాబితా వస్తుంది. అందులో ఓ హోటల్ ను ఎంచుకుని కూపన్ కోడ్ ను ఎంటర్ చేస్తే రాయితీ వస్తుంది. బుకింగ్ బటన్ పై క్లిక్ చేయడం ద్వారా నగదు చెల్లింపు ప్రక్రియ పూర్తవుతుంది.
Go Back to Shorts
OYO
NEET
Girls
Offer

More Telugu News