Rajeev Sagar: క‌విత స‌మ‌క్షంలో తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా రాజీవ్ సాగ‌ర్ బాధ్య‌తల స్వీకారం

rajeev sagar takes charge as ts foods corporation chairman
  • టీఎస్ ఫుడ్స్ కార్పొరేష‌న్ చైర్మన్‌గా ఇటీవ‌లే రాజీవ్ నియామ‌కం
  • తెలంగాణ జాగృతిలో ఉపాధ్యక్షుడిగా ప‌నిచేసిన సాగ‌ర్‌
  • ప‌ద‌వీ స్వీకారానికి భారీ ఎత్తున త‌ర‌లివచ్చిన టీఆర్ఎస్ శ్రేణులు
తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఇటీవ‌లే నియ‌మితులైన తెలంగాణ జాగృతి ఉపాధ్య‌క్షుడు మేడే రాజీవ్ సాగ‌ర్ బుధ‌వారం ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి కేసీఆర్ త‌న‌య‌, ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత కూడా హాజర‌య్యారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల‌ను కాపాడుకునేందుకు ఏర్పాటైన తెలంగాణ జాగృతిని విశ్వ‌వ్యాప్తం చేయ‌డంలో క‌విత‌కు రాజీవ్ సాగ‌ర్ ఎంత‌గానో తోడ్పాటు అందించారు. 

ఇక రాజీవ్ సాగ‌ర్ ప‌దవీ బాధ్య‌త‌ల స్వీకార కార్యక్రమానికి మంత్రులు జ‌గ‌దీశ్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, స‌త్య‌వ‌తి రాథోడ్ త‌దిత‌రులతో పాటు టీఆర్ఎస్‌కు చెందిన నేత‌లు, తెలంగాణ జాగృతి శ్రేణులు పెద్ద ఎత్తున హాజ‌ర‌య్యాయి.
Rajeev Sagar
K Kavitha
Telangana
Telangana Jagruthi
TS Foods Corporation

More Telugu News