Corona Virus: ఎల్లుండి నుంచి ఉచితంగా బూస్ట‌ర్ డోస్ పంపిణీ

free boster dose drive will befin from day after tomorrow
  • 18 నుంచి 59 ఏళ్ల వ‌య‌సు వారికి వ్యాక్సిన్ పంపిణీ
  • రెండున్నర నెల‌ల పాటు ఉచితంగా కొన‌సాగ‌నున్న కార్య‌క్ర‌మం
  • ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్‌లో భాగంగానే పంపిణీ
  • అన్ని ప్ర‌భుత్వ కేంద్రాల్లో ఉచితంగా ప్రికాష‌న్ డోస్
క‌రోనా నుంచి ర‌క్ష‌ణ కోసం వినియోగిస్తున్న బూస్ట‌ర్ డోస్‌ను ఉచితంగా పంపిణీ చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు బుధ‌వారం సాయంత్రం కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. ప్ర‌స్తుతం నిర్ణీత ధ‌ర‌ల‌కు ప్రైవేట్ కేంద్రాల ద్వారా పంపిణీ అవుతున్న బూస్ట‌ర్ డోస్ ను శుక్రవారం నుంచి దేశ‌వ్యాప్తంగా ఉచితంగా పంపిణీ చేయ‌నున్న‌ట్లు కేంద్రం ప్ర‌కటించింది. 

క‌రోనా ప్రికాష‌న్ డోస్‌గా పిలుస్తున్న బూస్ట‌ర్ డోస్‌ను శుక్ర‌వారం నుంచి ప్ర‌భుత్వ కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేయ‌నున్నారు. 18 నుంచి 59 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు క‌లిగిన వారంద‌రికీ ఉచితంగా బూస్ట‌ర్ డోస్‌ను అందించ‌నున్నారు. న‌రేంద్ర మోదీ స‌ర్కారు అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌డుతున్న ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్‌లో భాగంగానే బూస్ట‌ర్ డోస్ ఉచిత పంపిణీకి శ్రీకారం చుట్ట‌నున్నారు. రెండున్నర నెల‌ల పాటు ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్విరామంగా కొన‌సాగించ‌నున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.
Corona Virus
Bosster Dose
Prime Minister
Narendra Modi
BJP
Precaution Dose
Vaccine

More Telugu News