Raghu Rama Krishna Raju: తృణప్రాయమైన ఆస్తిని ఉంచుకుని.. విలువైన తల్లిని చెల్లికి ఇచ్చేశారు: జగన్ పై రఘురామకృష్ణరాజు విమర్శలు

Jagan has given his valuable mother to his sister says Raghu Rama Krishna Raju
  • జగన్ ఏం చదివారో తనకు తెలియదన్న రఘురాజు 
  • జనం కోరుకుంటున్న మద్యాన్ని ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్న 
  • బైజూస్ కొన్ని వేల మందిని ఉద్యోగాల నుంచి తీసేసినట్టు తనకు తెలిసిందని వ్యాఖ్య 
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సృష్టిలో అన్నింటికన్నా విలువైనది తల్లి అని... డబ్బులు వస్తాయి, పోతాయని చెప్పారు. తృణప్రాయమైన డబ్బును తన వద్ద ఉంచుకుని, విలువైన తల్లిని తన చెల్లికి జగన్ ఇచ్చేశారని విమర్శించారు. జగన్ ఏం చదివారో తనకు తెలియదని చెప్పారు. బైజూస్ పేరుతో విద్యార్థులకు ట్యాబ్ లు ఇస్తామని అంటున్నారని... ఆ సంస్థ కొన్ని వేల మందిని ఉద్యోగాల నుంచి తీసేసినట్టు తనకు తెలిసిందని అన్నారు. 

పిచ్చిపిచ్చి మందు బ్రాండ్లతో జనాలను పీక్కుతింటున్నారని విమర్శించారు. జనాలు కోరుకుంటున్న మద్యాన్ని ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. డిస్టిలరీలు నడుపుతున్నది ఎవరు, మద్యం అమ్ముతున్నది ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. వైన్ షాపుల దగ్గర కేవలం డబ్బు రూపంలో మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారని అడిగారు. డిజిటల్ రూపంలో లావాదేవీలు ఎందుకు చేయడం లేదని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.
Raghu Rama Krishna Raju
Jagan
YSRCP

More Telugu News