ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
- విద్యా శాఖ బిల్లుల చెల్లింపులో జాప్యంపై హైకోర్టులో పిటిషన్
- విచారణకు హాజరైన ఎస్ఎస్ రావత్, రాజశేఖర్, సురేశ్ కుమార్
- విచారణకు గైర్హాజరైన ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ
విద్యా శాఖకు చెందిన బిల్లుల చెల్లింపులో ఆర్థిక శాఖ తీవ్ర జాప్యం చేస్తోందంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆధ్వర్యంలోని ఏకసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ విచారణకు ఆర్థిక శాఖ నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎస్ఎస్ రావత్, రాజశేఖర్, సురేశ్ కుమార్‌లు హాజరయ్యారు. అయితే సత్యనారాయణ మాత్రం విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.