బండి సంజ‌య్‌కు బ‌ర్త్ డే విషెస్ చెప్పిన కేసీఆర్‌... సీఎంకు థ్యాంక్స్ చెప్పిన బీజేపీ ఎంపీ

bandi sahjay thanks kcr for birth day wishes
  • బ‌ర్త్ డే సంద‌ర్భంగా బండి సంజ‌య్‌కి విషెస్ వెల్లువ‌
  • నిండు నూరేళ్లు ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌న్న కేసీఆర్‌
  • కేసీఆర్‌కు ధ‌న్య‌వాదాలు చెబుతూ బండి సంజ‌య్ ట్వీట్‌
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు, క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని సోమ‌వారం ఆయ‌న‌కు పెద్ద ఎత్తున శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి. ఈ క్ర‌మంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఆయ‌న‌కు బ‌ర్త్ డే విషెస్ చెబుతూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. "మీకు హృద‌య‌పూర్వ‌క పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు. మీరు ఆయురారోగ్యాల‌తో నిండు నూరేళ్లు ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందించాల‌ని మ‌న‌స్ఫూర్తిగా ఆ భ‌గ‌వంతుడిని కోరుకుంటున్నాను" అంటూ ఆ ప్ర‌క‌ట‌న‌లో కేసీఆర్ ఆకాంక్షించారు. 

కేసీఆర్ గ్రీటింగ్స్‌కు స్పందించిన బండి సంజ‌య్‌... సీఎంకు ధ‌న్య‌వాదాలు తెలుపుతూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ ట్వీట్ చేశారు. "నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు అందజేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు" అంటూ స‌ద‌రు ట్వీట్‌లో బండి సంజ‌య్ పేర్కొన్నారు.
Go Back to Shorts
Telangana
BJP
Bandi Sanjay
KCR
TRS
Birth Day

More Telugu News