Maganti Gopinath: శ్రీలంక నేతలకు పట్టిన గతే బీజేపీ నేతలకూ పడుతుంది: మాగంటి గోపీనాథ్

Maganti Gopinath warns Bandi Sanjay
  • బండి సంజయ్ ఒక వెధవ అన్న మాగంటి 
  • మతాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలని సూచన 
  • బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు ఇవ్వండంటూ సవాల్ 
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఒక వెధవ అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ పిచ్చోడిలా మాట్లాడుతున్నారని, ఆయనను ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్చాలని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో చెప్పినట్టు గ్రేటర్ పరిధిలో విపత్తుల సమయంలో రూ. 25 వేలు, బండి పోతే మరో బండి ఇప్పుడు ఇస్తారా? అని ప్రశ్నించారు. 

మతాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలని హితవు పలికారు. చేతనైతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు ఇవ్వాలని సవాల్ విసిరారు. మీ కంటే ముందే రజాకార్ల సినిమాను తాను తీస్తానని చెప్పారు. సీఎంను నిజాంతో పోల్చవద్దని అన్నారు. బీజేపీ నేతలు పద్ధతి మార్చుకోకపోతే... శ్రీలంక నేతలకు పట్టిన గతే వీరికి కూడా పడుతుందని హెచ్చరించారు. 
Maganti Gopinath
TRS
Bandi Sanjay
BJP
Sri Lanka

More Telugu News