ద్రౌపది ముర్ముకే టీడీపీ మద్దతు...కారణమేమిటో చెప్పిన చంద్రబాబు
- రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము
- ఎన్నికల్లో మద్దతు విషయంపై టీడీపీ స్ట్రాటజీ కమిటీ భేటీ
- పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించిన చంద్రబాబు
- సామాజిక న్యాయానికి టీడీపీ ఆది నుంచి మద్దతు ఇస్తోందన్న టీడీపీ అధినేత
టీడీపీ స్ట్రాటజీ కమిటీ భేటీలో భాగంగా పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించిన చంద్రబాబు... రాష్ట్రపతి ఎన్నికల్లో ముర్ముకు మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సామాజిక న్యాయానికి టీడీపీ ఆది నుంచి మద్దతు ఇస్తోందని, ఆ మేరకే ముర్ముకు మద్దతు ఇచ్చే దిశగా నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.