పయ్యావుల కేశవ్ భద్రతను పునరుద్ధరించాలి: అచ్చెన్నాయుడు డిమాండ్
- కేశవ్ కు భద్రతను తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం
- ఇందుకా మీకు ప్రజలు పట్టం కట్టిందని ప్రశ్నించిన అచ్చెన్నాయుడు
- తామూ ఇదే మాదిరి వ్యవహరిస్తే జగన్ పాదయాత్ర చేసేవారా? అని ప్రశ్న
ప్రతీకార రాజకీయాలు చేయడానికా మీకు ప్రజలు పట్టం కట్టింది? అని నిలదీశారు. తక్షణమే పయ్యావుల కేశవ్ గారి భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇదే మాదిరిగా వ్యవహరిస్తే జగన్ రెడ్డి పాదయాత్ర చేయగలిగేవారా? అని అచ్చెన్న ప్రశ్నించారు.