నిత్యానందస్వామిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా: హీరోయిన్ ప్రియా ఆనంద్

  • గతంలో నిత్యానందతో సన్నిహితంగా గడిపిన ఒక హీరోయిన్
  • ఇప్పుడు ఆయనపై మనసు పారేసుకున్న మరో హీరోయిన్
  • నిత్యానందపై ప్రేమను వ్యక్తపరిచిన ప్రియా ఆనంద్
వివాదాస్పద నిత్యానందస్వామి మన దేశాన్ని విడిచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. సొంతంగా 'కైలాస' అనే దేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. తన దేశానికి ప్రత్యేక కరెన్సీ కూడా తయారు చేసుకున్నాడు. తమ దేశంలోకి అడుగు పెట్టాలంటే వీసా తప్పనిసరి అని ప్రకటించాడు. మరోవైపు గతంలో ఆయనతో ఒక హీరోయిన్ ఏకాంతంగా గడిపిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ అంశం పెను సంచలనం రేపింది. 

ఇప్పుడు మరో హీరోయిన్ ప్రియా ఆనంద్.. నిత్యానందస్వామిని పెళ్లి చేసుకోవాలని ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. పలు తెలుగు చిత్రాల్లో ఆమె నటించింది. తమిళం, హిందీ చిత్రాల్లో కూడా నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, నిత్యానంద గురించి తన మనసులోని ప్రేమను వ్యక్తపరిచింది. ఆయన గురించి ఎంతో వ్యతిరేక ప్రచారం జరుగుతున్నప్పటికీ... వేలాది మంది భక్తులు ఆయనను ఆరాధిస్తున్నారని చెప్పారు. ఆయనను పెళ్లి చేసుకుంటే తన పేరును కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉండదని అన్నారు.

Priya Anand
Tollywood
Nityananda Swamy

More Telugu News