Dharmana Prasada Rao: ఏడాదిలోనే జగన్ ప్రభుత్వం పని అయిపోతుందని చాలా మంది అన్నారు: ధర్మాన ప్రసాదరావు

పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ పని చేస్తున్నారని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. 50 - 75 ఏళ్ల క్రితమే ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ఉండి ఉంటే పేదల పరిస్థితి ఇలా ఉండేది కాదని చెప్పారు. తమది బంధువులకు, శ్రేయోభిలాషులకు అధికారాన్ని పంచి పెట్టే ప్రభుత్వం కాదని అన్నారు. 

ఏడాది లోపలే జగన్ ప్రభుత్వం పడిపోతుందని చాలా మంది అన్నారని... కానీ ఇప్పటికి మూడేళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్నామని చెప్పారు. రెండోసారి, మూడోసారి కూడా గెలుస్తామని అన్నారు. పేదలకు అన్ని సదుపాయాలను కల్పించి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపకపోతే ఎలాగని ప్రశ్నించారు. 
Dharmana Prasada Rao
Jagan
YSRCP

More Telugu News