TDP: అదిరిపోయే ఫొటోతో ధోనీకి బ‌ర్త్ డే విషెస్ చెప్పిన ప‌రిటాల శ్రీరామ్‌

paritala sreeram birth day wishes to ms dhoni
  • నేడు ధోనీ బ‌ర్త్ డే
  • క్రికెట్ ల‌వ‌ర్స్ నుంచి మ‌హీకి విషెస్ వెల్లువ‌
  • అసక్తి రేకెత్తించే ఫొటోను పోస్ట్ చేసిన ప‌రిటాల శ్రీరామ్‌

నేడు (జులై 7) టీమిండియా మాజీ సార‌థి, కెప్టెన్ కూల్ మ‌హేంద్ర సింగ్ ధోనీ జ‌న్మ‌దినం. ఈ సంద‌ర్భంగా క్రికెట్ ల‌వ‌ర్స్ నుంచి మ‌హీకి పెద్ద ఎత్తున బ‌ర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ యువ‌నేత ప‌రిటాల శ్రీరామ్ కూడా మ‌హీకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు చెబుతూ సోష‌ల్ మీడియాలో ఓ ఫొటోను పోస్ట్ చేశారు. 

టీమిండియా జెర్సీలో అటు తిరిగి నిల‌బ‌డి ఉన్న ధోనీ ఫొటోకు అభిముఖంగా ఉన్న గోడ‌పై ధోనీకి చెందిన ప‌లు ఫొటోల‌ను అతికించిన ఫొటోను ప‌రిటాల శ్రీరామ్ త‌న పోస్ట్‌కు జ‌త చేశారు. ఆయా సిరీస్‌ల‌లో టీమిండియాను విజ‌య‌ప‌థంలో న‌డిపి క‌ప్‌ల‌ను అందుకుంటున్న ధోనీ ఫొటోలు అందులో ఉన్నాయి. ప‌రిటాల శ్రీరామ్ పోస్ట్ చేసిన ఈ ఫొటో ప‌లువురిని ఆక‌ట్టుకుంటోంది.

  • Loading...

More Telugu News