Sreejith Ravi: విద్యార్థినుల పట్ల మలయాళ నటుడి అసభ్య ప్రవర్తన... అరెస్ట్ చేసిన పోలీసులు

Police arrests Malayalam actor Sreejith Ravi after he allegedly flashes to school girls
  • పాలక్కాడ్ లో ఘటన
  • పోక్సో చట్టం కింద కేసు నమోదు
  • 2016లోనూ ఇలాగే ప్రవర్తించిన నటుడు
కేరళ సినీ నటుడు శ్రీజిత్ రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాలక్కాడ్ లో ఇద్దరు విద్యార్థినుల ఎదుట శ్రీజిత్ రవి తన మర్మాంగాన్ని ప్రదర్శించాడన్న ఆరోపణలపై అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గత సోమవారం జరిగింది. శ్రీజిత్ రవిపై కఠినమైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. శ్రీజిత్ రవి కారు నుంచి దిగి రోడ్డుపై వెళుతున్న విద్యార్థినులకు మర్మాంగాన్ని చూపాడని పోలీసులు తెలిపారు. 

46 ఏళ్ల ఈ మలయాళ నటుడు ఇలా అసభ్యంగా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. 2016లోనూ ఇదే తరహాలో తన వికృత నైజాన్ని చాటుకున్నాడు. పాలక్కాడ్ లో 14 మంది విద్యార్థినులకు తన పురుషాంగాన్ని ప్రదర్శించాడు. అప్పట్లో అతడిని అరెస్ట్ చేయగా, బెయిల్ పై బయటికి వచ్చాడు.
Sreejith Ravi
Arrest
Girls
Palakkad
Kerala

More Telugu News