ఇళయరాజాకు శుభాకాంక్షలు తెలిపిన రజనీకాంత్

Rajinikanth congratulates Ilayaraja
  • ఇళయరాజాను రాజ్యసభకు నామినేట్ చేసిన కేంద్రం
  • రాష్ట్రపతి కోటాలో నామినేట్ చేసిన కేంద్ర సర్కార్
  • నా ప్రియమిత్రుడికి అభినందనలు అని ట్వీట్ చేసిన రజనీకాంత్
మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజాను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి కోటాలో ఈయనను రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ సభ్యునిగా నియమితులైన తన ప్రియ మిత్రుడు, సంగీత విద్వాంసుడు ఇళయరాజా గారికి హృదయపూర్వక అభినందనలు అని ట్వీట్ చేశారు. ఇళయరాజా, రజనీకాంత్ ల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. గత 28 ఏళ్లుగా వారి స్నేహం కొనసాగుతోంది. 

రాష్ట్రప‌తి కోటాలో ప‌లు రంగాల‌కు చెందిన న‌లుగురిని నామినేట్ చేస్తూ న‌రేంద్ర మోదీ స‌ర్కారు నిన్న కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ జాబితాలో ఇళయరాజాతో పాటు ప్రముఖ సినీ కథా రచయిత విజ‌యేంద్ర ప్ర‌సాద్‌, ప‌రుగుల రాణి పీటీ ఉష‌, వీరేంద్ర హెగ్డేల‌ను ఎన్డీఏ స‌ర్కారు రాజ్య‌స‌భకు నామినేట్ చేసింది.
Go Back to Shorts
Ilayaraja
Rajinikanth
Rajya Sabha
Tollywood
Kollywood

More Telugu News