ఈ మాస్కుతో కరోనా వైరస్ ఖతం!
- ఎన్ 95 మాస్క్ ఫిల్టర్లకు అమోనియం పాలీమర్ల గ్రాఫ్టింగ్
- తమ మీద పడిన వైరస్‌ను వెంటనే చంపేసేలా మాస్క్ అభివృద్ధి
- రెన్‌సెలీర్ పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తల ఘనత
ఈ నేపథ్యంలో రెన్‌సెలీర్ పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు సరికొత్తగా ఆలోచించారు. ఎన్95 మాస్కుల్లో వాడే పాలీప్రొపలీన్ ఫిల్టర్లలోకి బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీ మైక్రోబియల్ పాలీమర్లను విజయవంతంగా జోడించారు. అతినీలలోహిత కిరణాల సాయంతో వీటిని గ్రాఫ్టింగ్ చేశారు. యాంటీ బ్యాక్టీరియల్ సామర్థ్యం కలిగిన ఈ అమోనియం పాలీమర్లు తమమీద పడిన వైరస్‌ను చంపేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.