జగ్గయ్యపేటలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన బెజవాడ ఎంపీ కేశినేని నాని
- టీడీపీ హయాంలో ప్రారంభమైన అన్న క్యాంటీన్లు
- వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్లకు మూత
- టీడీపీ నేతలే స్వయంగా సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తున్న వైనం
ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యేలు శ్రీరాం రాజగోపాల్ (శ్రీరాం తాతయ్య), తంగిరాల సౌమ్య తదితరులు హాజరయ్యారు. అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన తర్వాత తొలి రోజు పేదలకు టీడీపీ నేతలు భోజనం పంపిణీ చేశారు.