Congress: బడంగ్‌పేట మేయ‌ర్ చేరిక కోసం ఢిల్లీకి త‌ర‌లివెళ్లిన టీ కాంగ్రెస్ అగ్ర నేత‌లు

Badangpeta mayer parijatha joind in congress in delhi
  • టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన పారిజాత దంప‌తులు
  • అనుచ‌రుల‌తో క‌లిసి రాహుల్ సమ‌క్షంలో కాంగ్రెస్‌లో చేరిక‌
  • రేవంత్‌, భ‌ట్టి విక్ర‌మార్క‌ వెంట రాగా ఢిల్లీలో జ‌రిగిన చేరిక‌లు
తెలంగాణలో రాజ‌కీయం ర‌సవ‌త్త‌రంగా మారుతోంది. బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలకు ఒక్క రోజు ముందుగా ఆ పార్టీకి చెందిన న‌లుగురు జీహెచ్ఎంసీ కార్పొరేట‌ర్లు టీఆర్ఎస్‌లో చేరిపోయారు. బీజేపీ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు ముగిసిన మ‌రునాడు టీఆర్ఎస్‌కు చెందిన బ‌డంగ్‌పేట మేయ‌ర్ పారిజాత దంప‌తులు త‌మ అనుచ‌రుల‌తో క‌లిసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. 

పారిజాత దంప‌తుల‌ను పార్టీలోకి ఆహ్వానించేందుకు తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) అగ్రనేత‌లు ఏకంగా ఢిల్లీకి వెళ్లారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌లు స‌హా ప‌లువురు కీల‌క నేత‌లు పారిజాత దంప‌తుల‌ను పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీకి ప‌రిచ‌యం చేశారు. రాహుల్ స‌మ‌క్షంలోనే పారిజాత దంప‌తులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
Congress
TRS
TPCC President
Revanth Reddy
Mallu Bhatti Vikramarka
Rahul Gandhi
Telangana

More Telugu News