రాజ్‌భ‌వ‌న్‌లో మొక్క నాటిన మోదీ!... ఆ మొక్క వివ‌రాలివే!

pm modi plants Kadamba plantin raj bhavan
  • మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోనే మోదీ
  • రెండు రోజుల పాటు హైద‌రాబాద్‌లో గ‌డిపిన వైనం
  • ఆదివారం రాత్రి రాజ్ భ‌వ‌న్‌లో బ‌స చేసిన ప్ర‌ధాని
మూడు రోజుల తెలుగు రాష్ట్రాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా తొలి రెండు రోజులు తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లోనే గ‌డిపిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ.. ఆదివారం రాత్రి హైద‌రాబాద్‌లోని గ‌వ‌ర్న‌ర్ అధికారిక నివాసం రాజ్ భ‌వ‌న్‌లో బ‌స చేశారు. సోమ‌వారం తెల్లారి లేచిన వెంట‌నే రాజ్ భ‌వ‌న్‌లో ఓ మొక్క‌ను నాటిన మోదీ... ఆ త‌ర్వాత ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు.

ఈ సందర్భంగా రాజ్ భ‌వ‌న్‌లో మోదీ నాటిన మొక్క వివ‌రాల‌ను వెల్ల‌డిస్తూ తెలంగాణ అట‌వీ శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. మోదీ నాటిన మొక్క పేరు క‌దంబ అని... ఇది మ‌త విశ్వాసాల‌తో కూడిన మొక్క అని ఆ శాఖ పేర్కొంది. అంతేకాకుండా ఔషధ గుణాలు కూడా ఈ మొక్క సొంతం అని వెల్ల‌డించింది. మొక్క‌ను నాటుతున్న మోదీ ఫొటోల‌ను కూడా ఆ శాఖ విడుద‌ల చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర రాజ‌న్ కూడా పాల్గొన్నారు.
Go Back to Shorts
Prime Minister
Narendra Modi
Raj Bhavan
Tamilisai Soundararajan
Hyderabad
Andhra Pradesh
Telangana
Kadamba

More Telugu News